Jagan: ఏపీలో కొవిడ్ పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష... ముఖ్యాంశాలు ఇవిగో!

  • ఏపీలో కరోనా కల్లోలం
  • వేల సంఖ్యలో కొత్త కేసులు
  • ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన సీఎం జగన్
  • కొవిడ్ నియంత్రణ తదితర అంశాలపై సమీక్ష
CM Jagan reviews corona situations in state

రాష్ట్రంలో కరోనా బీభత్సం మరింత విస్తరిస్తున్న నేపథ్యంలో సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. కొవిడ్ నియంత్రణ, వ్యాక్సినేషన్, ఆరోగ్యశ్రీ కింద కరోనాకు చికిత్స, కొవిడ్ కేర్ సెంటర్ల ఏర్పాటుపై అధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో సీఎం జగన్ పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.

సమీక్ష ముఖ్యాంశాలు

  • ఆరోగ్య శ్రీ ఆసుపత్రుల్లో కరోనా రోగులకు తప్పనిసరిగా బెడ్ కేటాయించాలి.
  • ఎంప్యానెల్ చేసిన ఆసుపత్రుల్లో 50 శాతం బెడ్లు కేటాయించాలి. అంతకంటే ఎక్కువ స్థాయిలో రోగులు వచ్చినా చేర్చుకోవాల్సిందే.
  • కలెక్టర్లు నోటిఫై చేసిన నాన్-ఎంప్యానెల్ ఆసుపత్రులకూ ఇదే వర్తిస్తుంది. ఆ మేరకు వెసులుబాటు కల్పించేలా నాన్-ఎంప్యానెల్ ఆసుపత్రులను తాత్కాలికంగా ఎంప్యానెల్ చేయాలంటూ ఆదేశం.
  • కొవిడ్ రోగులకు ఆరోగ్య శ్రీ పథకం కింద పూర్తి ఉచితంగా చికిత్స.
  • అన్ని ఆసుపత్రుల్లో కరోనా చికిత్స ఒకే విధంగా ఉండాలి.
  • 104కు వచ్చే కాల్స్ పై ఆయా జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులు వెంటనే స్పందించాలి.
  • కొవిడ్ ఆసుపత్రుల వద్ద ప్రత్యేక హ్యాంగర్ల ఏర్పాటు. హ్యాంగర్లలోనూ ఆసుపత్రి వైద్యులతో చికిత్స అందించే ఏర్పాట్లు. హ్యాంగర్లలో అన్ని వసతుల కల్పన.
  • కొవిడ్ ఆసుపత్రుల్లో ఆహారం, పారిశుద్ధ్యం, వైద్యుల అందుబాటు, వైద్య సదుపాయాలు, ఆక్సిజన్... ఈ ఐదు అంశాలు ఎంతో కీలకంగా భావించాలి.
  • ఎక్కడైనా వైద్యుల కొరత ఉంటే తాత్కాలికంగా అయినా నియామకాలు జరుపుకోవాలి.
  • ముఖ్యంగా ఆక్సిజన్ సరఫరాలో ఎక్కడా లోపాలు ఉండరాదు. కేంద్రం నుంచి పెద్ద మొత్తంలో ఆక్సిజన్ పొందడం, ఇతర మార్గాలపై అధికారులు కసరత్తులు చేయాలి. రోజుకు 500 టన్నుల ఆక్సిజన్ లభ్యతపై ఏంచేయాలో పరిశీలించండి.
  • ప్రతి బోధనాసుపత్రి వద్ద 10 కేఎల్ సామర్థ్యంతో ఆక్సిజన్ స్టోరేజీ ఉండాలి. అదే సమయంలో ఇతర ఆసుపత్రుల వద్ద 1 కేఎల్ కెపాసిటీతో ఆక్సిజన్ స్టోరేజీ ఉండాలి.

More Telugu News