YS Sharmila: ఇంకెంత మంది చనిపోతే కరోనా కంట్రోల్ తప్పిందనుకుంటారు?: కేసీఆర్ పై షర్మిల ఫైర్

  • కేసీఆర్ పై మరోసారి విమర్శలు గుప్పించిన షర్మిల
  • ఎంత మంది కరోనా బారిన పడితే కరోనా ఉందని గుర్తిస్తారు
  • కరోనా కంట్రోల్ లో ఉందని జబ్బలు చరుచుకోవడం మానుకోండి
YS Sharmila fires on KCR

తెలంగాణలో కరోనా వైరస్ బీభత్సంగా విస్తరిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని వైయస్ షర్మిల మండిపడ్డారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇంకెంతమంది ఆక్సిజన్ అందక చనిపోతే కరోనా కంట్రోల్ తప్పిందని భావిస్తారని ప్రశ్నించారు. ఆసుపత్రుల్లో బెడ్లు సరిపోక ఇంకెంత మంది రోడ్డున పడితే కరోనా విలయతాండవం చేస్తోందని అనుకుంటారని నిలదీశారు. ఇంకెంత మంది వ్యాక్సిన్ అందక కోవిడ్ బారిన పడితే కరోనా ఉందని గుర్తిస్తారని ప్రశ్నించారు.

తెలంగాణ ప్రజలు ఇంకెంత మంది అప్పుల బారిన పడితే రాష్ట్రంలో కరోనా అదుపు తప్పిందనుకుంటారని షర్మిల నిలదీశారు. కరోనా కంట్రోల్ లో ఉందని జబ్బలు చరుచుకోవడం మానుకోవాలని... మీ కళ్లకున్న గంతలు తీసి, కరోనాను కట్టడి చేయాలని డిమాండ్ చేశారు. 'కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చండి దొరగారూ' అని అన్నారు.

More Telugu News