లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

06-05-2021 Thu 17:28
  • 272 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 107 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 2.61 శాతం లాభపడిన బజాజ్ ఆటో షేర్
Markets ends in profits

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. మెటల్, ఆటో, ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్ స్టాకుల అండతో మార్కెట్లు పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 272 పాయింట్ల లాభంతో 48,949 వద్ద ముగిసింది. నిఫ్టీ 107 పాయింట్లు పెరిగి 14,725 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఆటో (2.61%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (2.20%), టెక్ మహీంద్రా (1.67%), ఇన్ఫోసిస్ (1.46%), మారుతి సుజుకి (1.12%).

టాప్ లూజర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-1.24%), ఓఎన్జీసీ (-0.86%), బజాజ్ ఫిన్ సర్వ్ (-0.71%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.69%), ఎన్టీపీసీ (-0.67%).