MK Stalin: 34 మందితో తమిళనాడు క్యాబినెట్... గవర్నర్ ఆమోదం

Governor approves Tamilnadu cabinet
  • అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఘనవిజయం
  • ఈ నెల 7న సీఎంగా స్టాలిన్ ప్రమాణస్వీకారం 
  • నూతన మంత్రివర్గాన్ని ఖరారు చేసిన స్టాలిన్
  • భావి సీఎం సిఫారసులకు గవర్నర్ రాజముద్ర
తమిళనాడులో కొత్త ప్రభుత్వం కొలువుదీరుతోంది. ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించనున్న డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ మంత్రివర్గాన్ని రూపొందించారు. తనతో కలిపి 34 మంది మంత్రుల జాబితాను స్టాలిన్ రాష్ట్ర గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ కు పంపారు. గవర్నర్ ఈ జాబితాను లాంఛనంగా ఆమోదించారు. భావి సీఎం స్టాలిన్ సిఫారసులకు రాజముద్ర వేశారు.

కాగా, స్టాలిన్ కుమారుడు ఉదయనిధికి కూడా మంత్రివర్గంలో స్థానం లభించనుందని గత కొన్నిరోజులుగా తమిళనాడు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే, స్టాలిన్ గవర్నర్ కు పంపిన జాబితాలో ఉదయనిధి పేరు లేదు. ఇక, స్టాలిన్ సాధారణ పరిపాలన సహా పలు శాఖలను తన వద్ద ఉంచుకుంటున్నట్టు తెలుస్తోంది. స్టాలిన్ ఈ నెల 7న ప్రమాణస్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే.
MK Stalin
Cabinet
Governor
DMK
Tamilnadu

More Telugu News