ఇమ్యూనిటీ పెంచే ఔషధాలు అందించిన అర్షి క్లినిక్... కృతజ్ఞతలు తెలిపిన బాలకృష్ణ

06-05-2021 Thu 16:28
  • అర్షి స్కిన్, హెయిర్ క్లినిక్ దాతృత్వం
  • రూ.30 లక్షల విలువైన ఔషధాల వితరణ
  • హిందూపురం ప్రజలు, క్యాన్సర్ రోగుల కోసం విరాళం
  • స్పందించిన బాలకృష్ణ
Nandamuri Balakrishna appreciates Arshi Skin and Hair Clinic for their donation

హైదరాబాదుకు చెందిన అర్షి స్కిన్ మరియు హెయిర్ క్లినిక్ కరోనా నేపథ్యంలో ఇమ్యూనిటీ పెంచే ఔషధాలను విరాళంగా అందించింది. రూ.30 లక్షల విలువైన వ్యాధి నిరోధకత పెంపు ఔషధాలను అర్షి సంస్థ అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గ ప్రజలకు, హైదరాబాదులోని బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్యాన్సర్ రోగులకు, తక్కువ వ్యాధి నిరోధకశక్తి ఉన్నవారికి ఉచితంగా అందజేసింది.

దీనిపై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందిస్తూ, అర్షి స్కిన్ మరియ హెయిర్ క్లినిక్ కు చెందిన డాక్టర్ వీఎస్బీ బండి, డాక్టర్ అన్నపూర్ణ ప్రదర్శించిన దాతృత్వం హిందూపురం ప్రజలతో పాటు, బసవతారకం ఆసుపత్రిలోని క్యాన్సర్ రోగులకు కూడా ఎంతో మేలు చేస్తుందని అన్నారు. ఎంతో ఉదారత చూపిన వారికి బసవతారకం సంస్థల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. అర్షి క్లినిక్ విరాళంగా ఇచ్చిన ఔషధాలను హిందూపురం నియోజకవర్గంలోనూ పంపిణీ చేస్తామని బాలకృష్ణ చెప్పారు.