లాక్ డౌన్ అవసరం లేదంటున్న సీఎస్ పరిస్థితి ఎక్కడ బాగుందో చెప్పాలి: వీహెచ్ 

06-05-2021 Thu 16:08
  • తెలంగాణలో కరోనా అదుపులోనే ఉందన్న సీఎస్
  • కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయన్న వీహెచ్
  • ఆక్సిజన్, బెడ్లు లభించడంలేదని వ్యాఖ్యలు
  • సీఎస్ వాస్తవాలు చెప్పాలంటూ వీహెచ్ డిమాండ్
VH demands Telangana CS should tell facts about corona situations in state

ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉందని, లాక్ డౌన్ అవసరం లేదని తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ వ్యాఖ్యానించడం తెలిసిందే. అక్కడి పరిస్థితులను పరిగణనలోకి తీసుకునే ఇతర రాష్ట్రాలు లాక్ డౌన్ విధించాయని సోమేశ్ కుమార్ పేర్కొన్నారు. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు స్పందించారు.

లాక్ డౌన్ అవసరం లేదంటున్న సీఎస్, పరిస్థితులు ఎక్కడ బాగున్నాయో చెప్పాలని నిలదీశారు. నానాటికీ కరోనా కేసులు పెరుగుతున్నాయని, ఆసుపత్రుల్లో ఆక్సిజన్, పడకలు దొరకడంలేదని వీహెచ్ తెలిపారు. సీఎస్ సోమేశ్ కుమార్ ప్రజలకు వాస్తవాలు చెప్పాలని హితవు పలికారు. ఈ సందర్భంగా ఆయన రాజకీయపరమైన వ్యాఖ్యలు కూడా చేశారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒక్కటేనని విమర్శించారు. బెంగాల్ సీఎంపై బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండిస్తున్నానని అన్నారు. వెంటనే మమతా బెనర్జీకి బండి సంజయ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.