Southwest Monsoon: జూన్ 1న కేరళ తీరాన్ని తాకనున్న నైరుతి రుతుపవనాలు

  • త్వరలో భారత్ లో నైరుతి సీజన్
  • రుతుపవనాలు సకాలంలోనే వస్తున్నాయన్న ఐఎండీ
  • ఈ నెల 15న అధికారిక ప్రకటన
  • ఈ నెల 31న వర్షపాతం అంచనాల వెల్లడి
IMD says southwest monsoon ti hit Kerala coast in time

దేశ వ్యవసాయ రంగానికి ఊతమిచ్చే నైరుతి రుతుపవనాల ఆగమనంపై భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శుభవార్త చెప్పింది. సాధారణ రీతిలోనే జూన్ 1న నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయని తెలిపింది. భారత వాతావరణ శాఖ ప్రకటనపై కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి మాధవన్ రాజీవన్ స్పందించారు.

నైరుతి రుతుపవనాలు సకాలంలో వస్తున్నాయని, జూన్ 1న కేరళను తాకి, ఆపై దేశంలో ప్రవేశిస్తాయని తెలిపారు. ఇది ముందస్తు సూచన అని వివరించారు. అధికారికంగా ఈ నెల 15న ప్రకటన ఉంటుందని, దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల కారణంగా నమోదయ్యే వర్షపాతం వివరాలపై ఈ నెల 31న అప్ డేట్ ఉంటుందని పేర్కొన్నారు.

More Telugu News