Muraleedharan: బెంగాల్ లో కేంద్రమంత్రి మురళీధరన్ వాహనంపై దాడి... కేంద్రం ఆగ్రహం

Mob attacks on Union Minister Muraleedharan vehicle in West Bengal
  • పశ్చిమ బెంగాల్ లో ముగిసిన అసెంబ్లీ ఎన్నికలు
  • రాష్ట్రంలో పలు చోట్ల హింసాత్మక ఘటనలు
  • తాజాగా కేంద్రమంత్రి కారుపై రాళ్ల దాడి
  • నివేదిక ఇవ్వాలంటూ గవర్నర్ ను ఆదేశించిన కేంద్రం
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైనప్పటి నుంచి రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో హింస ప్రజ్వరిల్లుతూనే ఉంది. తాజాగా బెంగాల్ లో కేంద్రమంత్రి మురళీధరన్ కారుపై దాడి జరిగింది. కొందరు వ్యక్తలు కర్రలు, రాళ్లతో మంత్రి ప్రయాణిస్తున్న వాహనంపై దాడి చేశారు. పశ్చిమ మిడ్నాపూర్ లోని పంచక్కుడిలో ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో కేంద్రమంత్రి మురళీధరన్ కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి.

ఈ దాడిలో తన వ్యక్తిగత సిబ్బందికి గాయాలు అయ్యాయని మురళీధరన్ తెలిపారు. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలే తనపై దాడికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. తన వాహనంపై దాడికి సంబంధించిన వీడియోను కూడా పంచుకున్నారు. కాగా, బెంగాల్ లో హింసాత్మక ఘటనలపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వరుసగా హింస చోటుచేసుకోవడం పట్ల బెంగాల్ గవర్నర్ నుంచి కేంద్రం నివేదిక కోరింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన ఘటనలపై ఇప్పటికే నలుగురు సభ్యుల కమిటీని నియమించింది.
Muraleedharan
Attack
West Bengal
TMC
BJP

More Telugu News