వ‌ర్క్ ఫ్రమ్ హోం చేస్తోన్న రోజా.. వీడియో ఇదిగో

06-05-2021 Thu 13:17
  • కొన్ని రోజుల క్రితం చెన్నైలోని ఓ ఆసుపత్రిలో సర్జరీ 
  • అనంత‌రం డిశ్చార్జ్ .. ఇంట్లో విశ్రాంతి 
  • అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధుల‌తో వ‌ర్చువ‌ల్ ప‌ద్ధ‌తిలో స‌మావేశం
 Had Virtual Interaction with Officers Public Representatives says roja

కొన్ని రోజుల క్రితం చెన్నైలోని ఓ ఆసుపత్రిలో సర్జరీ చేయించుకున్న నగరి ఎమ్మెల్యే రోజా అనంత‌రం డిశ్చార్జ్ అయిన విష‌యం తెలిసిందే. నెలరోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని ఆమెకు వైద్యులు సూచించ‌డంతో ఆమె ఇంటి నుంచే ప‌నిచేస్తున్నారు.   కొంద‌రు అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధుల‌తో తాను వ‌ర్చువ‌ల్ ప‌ద్ధ‌తిలో మాట్లాడాన‌ని తెలుపుతూ రోజా ఓ వీడియోను పోస్ట్ చేశారు. రెండు రోజుల క్రితం కూడా ఆమె క‌రోనా ఫ్రంట్ లైన్ వారియ‌ర్ల‌తో వ‌ర్చువ‌ల్ ప‌ద్ధ‌తిలో మాట్లాడి క‌రోనా క‌ట్ట‌డికి తీసుకోవాల్సిన చ‌ర్య‌లు, ప్ర‌జ‌ల‌కు అందించాల్సిన సాయంపై సూచ‌న‌లు చేశారు.