దాడుల‌కు మూల్యం చెల్లించుకోక‌త‌ప్ప‌దు: అచ్చెన్నాయుడు

06-05-2021 Thu 13:05
  • ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ప్రోత్సాహంతోనే రౌడీ మూక‌ల విజృంభ‌ణ‌
  • మాజీ స‌ర్పంచి రామ‌స్వామి ఇంటిపై వైసీపీ దాడి చేయ‌డం దుర్మార్గం
  • అర్ధ‌రాత్రి క‌త్తులు, రాళ్ల‌తో హత్యాయత్నానికి ఒడిగ‌ట్టారు
  • నిందితుల‌పై పోలీసులు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాలి
atchannaidu slams jagan

వైసీపీ నేతల తీరుపై టీడీపీ ఏపీ అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దాడుల‌తో వైసీపీ రెచ్చిపోతోంద‌ని ఆరోపించారు. అధికార గ‌ర్వంతో చేయిస్తోన్న దాడుల‌కు మూల్యం చెల్లించుకోక‌ త‌ప్ప‌దని ఆయ‌న హెచ్చ‌రించారు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ప్రోత్సాహంతోనే రాష్ట్రంలో రౌడీ మూక‌లు విజృంభిస్తున్నాయ‌ని ఆయ‌న ఆరోపించారు.

మాజీ స‌ర్పంచి రామ‌స్వామి ఇంటిపై వైసీపీ వారు దాడి చేశార‌ని, ఈ ఘ‌ట‌న‌ దుర్మార్గమ‌ని అచ్చెన్నాయుడు మండిప‌డ్డారు. అర్ధ‌రాత్రి క‌త్తులు, రాళ్ల‌తో హత్యాయత్నానికి ఒడిగ‌ట్టారని ఆయ‌న తెలిపారు. ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డ్డ నిందితుల‌పై పోలీసులు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాలని ఆయ‌న డిమాండ్ చేశారు.