క‌రోనాతో ఆసుపత్రిలో సినీ ద‌ర్శ‌కుడు నంద్యాల ర‌వి.. రూ.ల‌క్ష సాయ‌మందించిన హాస్యనటుడు స‌ప్త‌గిరి

06-05-2021 Thu 12:52
  • ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న నంద్యాల ర‌వి
  • క‌రోనాతో పరిస్థితి విష‌మం
  • ఇప్ప‌టికే కరోనా క్రైసిస్‌ ఛారిటీ నుంచి కూడా కొంత సాయం  
Saptagiri 1 Lakh Financial Help To Director Nandyala Ravi

సినీ ద‌ర్శ‌కుడు, ర‌చయిత నంద్యాల ర‌వికి క‌రోనా సోకడంతో ప్ర‌స్తుతం ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే, ప్ర‌స్తుతం ఆయ‌న ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌నకు క‌రోనా సోకి, పరిస్థితి విష‌మంగా ఉండడంతో ఆయ‌న‌ కుటుంబ స‌భ్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ ప‌రిస్థితుల్లో నంద్యాల ర‌వికి సినీ హాస్య న‌టుడు స‌ప్త‌గిరి త‌న వంతుగా రూ.ల‌క్ష సాయం అందించి మంచి మ‌న‌సును చాటుకున్నాడు. కాగా, నంద్యాల ర‌వికి కరోనా క్రైసిస్‌ ఛారిటీ (సీసీసీ) నుంచి కూడా కొంత సాయం అందిన‌ట్లు తెలిసింది. ప్రస్తుతం నంద్యాల ర‌వి ద‌ర్శ‌క‌త్వంలో స‌ప్త‌గిరి ఓ సినిమా చేస్తున్నాడు.