Budda Venkanna: ఇవన్నీ తప్పుడు వార్తలు అంటూ అనేక ఫ్యాక్ట్ చెక్ వెబ్ సైట్లు చెప్పాయి: బుద్ధా వెంక‌న్న

  • ఏపీ ప్రజలకు అర్థం కాకూడదని ఇంగ్లిష్ లో ఒక వీడియో రూపొందించారు
  • కరోనా ట్రీట్మెంట్ ఫ్రీ అంటూ డబ్బా కొట్టాడు ఫేక్ సీఎం
  • అది పట్టుకుని పేటీఎం పెద్ద కూలీలు రంగంలోకి దిగారు
  • నేషనల్ వైడ్ డబ్బా కొట్టించారు
budha venkanna slams jagan

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌భుత్వ, ప్రైవేటు ఆసుప‌త్రుల్లో క‌రోనాకు ఉచితంగా చికిత్స అంటూ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ చెప్పిన‌ట్లు ఉన్న ఓ వీడియోను పోస్ట్ చేసిన టీడీపీ నేత‌ బుద్ధా వెంక‌న్న దీనిపై విమ‌ర్శ‌లు గుప్పించారు.

'ఇక్కడ ఏపీ ప్రజలకు అర్థం కాకూడదని, ఇంగ్లిష్ లో ఒక వీడియో చేసి, కరోనా ట్రీట్మెంట్ ఫ్రీ అంటూ డబ్బా కొట్టాడు, ఫేక్ సీఎం. అది పట్టుకుని, పేటీఎం పెద్ద కూలీలు రంగంలోకి దిగి, నేషనల్ వైడ్ డబ్బా కొట్టించారు. ఇవన్నీ తప్పుడు వార్తలు అంటూ అనేక ఫ్యాక్ట్ చెక్ వెబ్ సైట్లు కౌంటర్ ఇచ్చాయి' అని బుద్ధా వెంక‌న్న చెప్పారు.

'జగన్ రెడ్డి, నీకు దమ్ము ఉంటే, కరోనా ట్రీట్మెంట్ ఫ్రీ, ఒక్క పైసా అవసరం లేదని, ప్రతి హాస్పిటల్ ముందు, నీ సుందరమైన ముఖంతో, ఒక బ్యానర్ పెట్టించు. ఫేక్ ఫెలోస్ , ఫేక్ పార్టీ అనేది ఇందుకే' అని బుద్ధా వెంక‌న్న విమ‌ర్శించారు.

More Telugu News