Sajjala Ramakrishna Reddy: ఆ విషయం చంద్రబాబుకు తెలియ‌దా?: సజ్జల

Sajjala fires on Chandrababu
  • కరోనా కట్టడికి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది
  • కోవిడ్ వ్యాక్సిన్ కేంద్రం అధీనంలో ఉంటుంది
  • ప్రజల ఆరోగ్యం కోసం కరోనాను ఆరోగ్యశ్రీ కిందకు తీసుకొచ్చాం
కరోనాను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోందని ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ప్రభుత్వంపై టీడీపీ అధినేత చేస్తున్న విమర్శలు విడ్డూరంగా ఉన్నాయని విమర్శించారు. కరోనా వ్యాక్సిన్లు రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఉండవని, కేంద్రం అధీనంలో ఉంటాయనే విషయం చంద్రబాబుకు తెలియదా? అని ప్రశ్నించారు. 'పక్క రాష్ట్రంలో దాక్కున్న ప్రవాసాంధ్రుడు చంద్రబాబు' అని విమర్శించారు. ప్రతిరోజూ టీడీపీ నేతలతో జూమ్ మీటింగ్ నిర్వహిస్తూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారని మండిపడ్డారు. కరోనా కట్టడిలో ఇతర రాష్ట్రాల కంటే ఏపీ మెరుగ్గా ఉందని చెప్పారు.

ప్రజల సంక్షేమం తప్ప సీఎం జగన్ కు మరో ధ్యాస లేదని సజ్జల అన్నారు. కరోనాను కట్టడి చేయడానికి కర్ఫ్యూని అమలు చేస్తున్నారని చెప్పారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలనే కరోనాను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చామని తెలిపారు. రోజుకు 6 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు ఇచ్చే సామర్థ్యం ఏపీకి ఉందని.. కేంద్రం సరిపడా డోసులు ఇస్తే 35 రోజుల్లో అందరికీ వ్యాక్సిన్ ఇస్తామని అన్నారు.
Sajjala Ramakrishna Reddy
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News