ఏపీలో కొత్తగా 22 వేలకు పైగా కరోనా కేసుల నమోదు

05-05-2021 Wed 20:38
  • 24 గంటల్లో 22,204 కేసుల నమోదు
  • ఇదే సమయంలో 83 మంది మృతి
  • రాష్ట్రంలో 1,70,588 యాక్టివ్ కేసులు
AP registers more thand 22K Corona cases

ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడం లేదు. నానాటికీ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లో ఏకంగా 22,204 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇదే సమయంలో 83 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. కరోనా బారిన పడిన వారితో పోలిస్తే మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య సగానికి సగం ఉంది. గత 24 గంటల్లో 11,128 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

ఇప్పటి వరకు రాష్ట్రంలో 12,06,232 మంది కరోనా బారిన పడగా... 10,27,270 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,70,588 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 8,374 మంది కరోనా బారిన పడి మృతి చెందారు.