యూట్యూబ్‌లో 10 మిలియన్‌ వ్యూస్‌ సొంతం చేసుకున్న జ్వాలారెడ్డి సాంగ్‌!

05-05-2021 Wed 20:23
  • గోపీచంద్‌, తమన్నా నటించిన చిత్రం సీటీమార్‌
  • లక్ష లైక్‌లూ సాధించిన జ్వాలారెడ్డి సాంగ్‌
  • మణిశర్మ సంగీతంలో మంగ్లీ, శంకర్‌బాబు పాడిన పాట
  • సాహిత్యం అందించిన కాసర్ల శ్యామ్‌
  • సంపత్‌ నంది దర్శకత్వం
Jwalareddy Song of gopichands has gained 10 million views in youtube

ప్రముఖ హీరో గోపీచంద్‌, మిల్కీ బ్యూటీ తమన్నా నటించిన చిత్రం సీటీమార్‌. ఏప్రిల్‌ 2న విడుదల కావాల్సిన ఈ చిత్రం వివిధ కారణాల వల్ల వాయిదా పడింది. అయితే, ఈ సినిమాకు సంబంధించి యూట్యూబ్‌లో విడుదలైన ‘జ్వాలారెడ్డి’ అనే లిరికల్‌ వీడియో సాంగ్‌ మాత్రం హల్‌చల్‌ చేస్తోంది.

ఈ క్రమంలో ఇప్పటి వరకు ఇది 10 మిలియన్ల వ్యూస్‌కి పైగా సొంతం చేసుకొంది. అలాగే లక్షకు పైగా లైక్‌లనూ సాధించింది.  దీనిపై చిత్రబృందం హర్షం వ్యక్తం చేసింది. పాటకు మంచి ఆదరణ లభించడంతో సినిమాపైనా ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. అయితే, తదుపరి విడుదల తేదీపై ఇప్పటి వరకు స్పష్టత లేకపోవడం అభిమానుల్ని నిరాశకు గురిచేస్తోంది.

ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ స్వరాలు సమకూర్చిన ఈ పాటను శంకర్‌బాబు, మంగ్లీ ఆలపించారు. కాసర్ల శ్యామ్‌ సాహిత్యం అందించారు. సంపత్‌ నంది దర్శకత్వంలో శ్రీనివాస్ చిట్టూరి ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కినట్లు చిత్ర బృందం తెలిపింది.యాక్షన్‌ స్టార్ గోపీచంద్‌, గ్లామరస్ బ్యూటీ తమన్నా హీరో హీరోయిన్లుగా ఉన్న ఈ చిత్రంలో భూమిక కీలక పాత్ర పోషించారు.