విజయ్ దేవరకొండ బర్త్ డేకి 'లైగర్' టీజర్?

05-05-2021 Wed 18:51
  • పూరి దర్శకత్వంలో 'లైగర్'
  • బాక్సర్ గా విజయ్ దేవరకొండ
  • హీరోయిన్ గా అనన్య పాండే పరిచయం
  • సెప్టెంబర్ 9వ తేదీన విడుదల  
Liger teaser is going to release on Vijay Devarakonda birthday
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ 'లైగర్' చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల క్రితమే మొదలైంది. అయితే కరోనా కారణంగా వాయిదాలు పడుతూ ఉండటం వలన ఆలస్యమవుతోంది. ఇది పూర్తిగా పూరి మార్క్ మూవీ. హీరోగా విజయ్ దేవరకొండ మార్క్ కూడా పూరికి దగ్గరగానే ఉంటుంది గనుక, ఈ సినిమా అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపించనున్నాడు. ఈ సినిమా ద్వారా కథానాయికగా 'అనన్య పాండే' తెలుగు తెరకి పరిచయమవుతోంది.

ఈ నెల 9వ తేదీన విజయ్ దేవరకొండ పుట్టినరోజు .. అందువలన ఆ రోజున ఈ సినిమా నుంచి ఫస్టు టీజర్ ను రిలీజ్ చేయనున్నట్టు చెప్పుకుంటున్నారు. పూరి ఆ ప్రయత్నంలోనే ఉన్నాడని అంటున్నారు. ఫస్టు టీజర్ తోనే సినిమాపై మరింతగా అంచనాలు పెంచేయాలనే ఉద్దేశంతో పూరి ఉన్నాడని చెబుతున్నారు. ఈ సినిమాలో రమ్యకృష్ణ ఒక కీలకమైన పాత్రను పోషిస్తోంది. ఈ పాత్ర హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. సెప్టెంబర్ 9వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.