బాలకృష్ణ సరసన సందడి చేయనున్న బోల్డ్ బ్యూటీ!

05-05-2021 Wed 18:18
  • గోపీచంద్ మలినేనితో బాలకృష్ణ
  • ఇద్దరు హీరోయిన్లకు చోటు
  • రాయ్ లక్ష్మికి దక్కిన ఛాన్స్
  • త్వరలో సెట్స్ పైకి
Rai Lakshmi is heroin in Balakrishna movie

బాలకృష్ణకి మాస్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ కి తగినట్టుగానే ఆయన తన సినిమాలు ఉండేలా చూసుకుంటున్నారు. కథ ఎలాంటిదైనా అందులో తన నుంచి మాస్ ఆడియన్స్ ఆశించే మసాలా అంశాలు తగ్గకుండా చూసుకుంటారు. ముఖ్యంగా తన సినిమాలోని పాటలు మాస్ ఆడియన్స్ కి బాగా రీచ్ అయ్యేలా బాలకృష్ణ జాగ్రత్తపడతారు. అంతేకాదు .. సాధ్యమైనంతవరకూ తన సినిమాలో ఇద్దరు కథానాయికలు ఉండేలా చూసుకుంటారు. అలా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేసే సినిమాలోనూ ఇద్దరు నాయికలు ఉంటారట.

ప్రస్తుతం బోయపాటితో బాలకృష్ణ 'అఖండ' చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా ఆలస్యమవుతోందిగానీ, వాస్తవానికి ఈ నెలలో ఈ సినిమా థియేటర్లకు రావలసింది. ఈ సినిమా తరువాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ ఒక యాక్షన్ ఎంటర్టైనర్ చేయనున్నారు. ఈ సినిమాలో ముందుగా రాయ్ లక్ష్మితో ఒక ఐటమ్ చేయిద్దామని అనుకున్నారట. ఆ తరువాత ఆమెనే మెయిన్ హీరోయిన్ గా ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. గతంలో 'అధినాయకుడు' సినిమాలో బాలకృష్ణతో రాయ్ లక్ష్మి జోడీ కట్టింది .. ఇది రెండవసారన్న మాట. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది.