Nara Lokesh: సీఎంకు కృతజ్ఞతలు... పరీక్షలు రద్దు చేయాలంటూ జగన్‌కు నారా లోకేశ్ లేఖ

Nara Lokesh Writes letter to ys jagan
  • ట్వీట్ చేసిన టీడీపీ నేత
  • మూడు వారాల ఆందోళన తర్వాత ఇంటర్ పరీక్షలు రద్దు చేశారన్న లోకేశ్
  • సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన నేత
రాష్ట్రంలో కొవిడ్ వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్న నేపథ్యంలో ఈ నెలలో నిర్వహించాల్సిన అన్ని పరీక్షలను రద్దు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి లేఖ రాసినట్టు టీడీపీ నేత, ఎమ్మెల్సీ నారా లోకేశ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మూడు వారాల పాటు చేసిన ఆందోళన, న్యాయపోరాటం తర్వాత ఎట్టకేలకు ఇంటర్ పరీక్షలు వాయిదా వేశారని, ఇందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు చెప్పారు. ఇదే స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెలలో జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేయడమో, లేదంటే పూర్తిగా రద్దు చేయడమో చేయాలని ముఖ్యమంత్రికి రాసిన లేఖలో కోరినట్టు లోకేశ్ పేర్కొన్నారు.
Nara Lokesh
YS Jagan
Exams
Andhra Pradesh

More Telugu News