Andhra Pradesh: ఏపీ అసెంబ్లీ కార్యదర్శిగా బాలకృష్ణమాచార్యులను మళ్లీ నియమించిన ప్రభుత్వం

Balakrishnamacharyulu reoppointed
  • ఆదేశాలు జారీ చేసిన సీఎస్ ఆదిత్యనాథ్ దాస్
  • ఏప్రిల్ 2023 వరకు పదవిలో కొనసాగనున్న బాలకృష్ణమాచార్యులు 
  • గతంలో కోర్టు ధిక్కరణ కింద శిక్ష అనుభవించిన వైనం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కార్యదర్శిగా బాలకృష్ణమాచార్యులను తిరిగి నియమిస్తూ ఏపీ ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం బాలకృష్ణమాచార్యులు ఏప్రిల్ 2023 వరకు అసెంబ్లీ కార్యదర్శి పదవిలో కొనసాగుతారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా, 2017లో హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయడంలో విఫలమయ్యారంటూ గతేడాది బాలకృష్ణమాచార్యులకు కోర్టు ధిక్కరణ నేరం కింద శిక్ష విధించింది. కోర్టు సమయం ముగిసే వరకు కోర్టులో కూర్చోవాలని ఆదేశించడంతోపాటు రూ. 1000 జరిమానా విధించింది.
Andhra Pradesh
Andhra Pradesh Assembly
Balakrishnamacharyulu

More Telugu News