మ‌మ‌త దీదీకి శుభాకాంక్ష‌లు: ప్రధాని మోదీ

05-05-2021 Wed 13:27
  • పశ్చిమ బెంగాల్ ఎన్నిక‌ల్లో తృణ‌మూల్ కాంగ్రెస్ విజ‌యం
  • సీఎంగా మ‌మ‌త ప్ర‌మాణ స్వీకారం 
  • స్పందించిన ప్ర‌ధాని మోదీ
Congratulations to Mamata Didi on taking oath as West Bengals Chief Minister

పశ్చిమ బెంగాల్ ఎన్నిక‌ల్లో తృణ‌మూల్ కాంగ్రెస్ భారీ మెజార్టీతో విజ‌యం సాధించిన నేప‌థ్యంలో ఈ రోజు ఆ పార్టీ అధినేత్రి మమత బెనర్జీ ముఖ్య‌మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విష‌యం తెలిసిందే. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ జగ్‌దీప్‌ ధన్‌కడ్‌ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించగానే ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీ దీనిపై స్పందించారు. ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన మ‌మ‌త దీదీకి శుభాకాంక్ష‌లు అని మోదీ ట్వీట్ చేశారు. మరోపక్క, మ‌మ‌తకు ప‌లువురు నేత‌లు కూడా శుభాకాంక్ష‌లు తెలిపారు.