ఉప్ప‌ల్‌లో కంటైన‌ర్‌కు మంట‌లు.. ఇద్ద‌రి స‌జీవ ద‌హ‌నం

05-05-2021 Wed 12:40
  • శంషాబాద్ నుంచి ఉప్పల్ ఐడీఏకు వెళ్తున్న‌ కార్ల కంటైనర్‌
  • మాడ్రన్ బెడ్ ప్రాంతంలో విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టిన‌ కంటైన‌ర్‌
  • డ్రైవ‌ర్, లోకల్ గైడ్‌కు మంట‌లు అంటుకుని మృతి 
  • పూర్తిగా కాలిపోయిన కంటైనర్లోని కార్లు 
accident in uppal

హైదరాబాద్ శివారులోని ఉప్ప‌ల్‌లో ఘోర ప్ర‌మాదం చోటు చేసుకుంది.  విద్యుదాఘాతం వల్ల మంటలు చెల‌రేగి ఇద్దరు వ్యక్తులు సజీవదహనమయ్యారు. రాజస్థాన్‌కు చెందిన కంటైనర్ డ్రైవర్ షహజాజ్(38), హైదరాబాద్ వాసి, లోకల్ గైడ్‌ గంగా సాగర్(50) శంషాబాద్ నుంచి ఉప్పల్ ఐడీఏకు కార్ల కంటైనర్‌తో బయల్దేరారు.

ఆ స‌మ‌యంలో మాడ్రన్ బెడ్ ప్రాంతంలో వారి కంటైన‌ర్‌ క‌రెంటు స్తంభాన్ని ఢీకొట్టడంతో విద్యుత్తు తీగలు కంటైనర్‌పై పడ్డాయి. దీంతో అందులో  మంటలు వ్యాపించి, ఇద్దరూ అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. ఆ కంటైనర్‌లోని కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘ‌ట‌న‌పై సమాచారం అందుకున్న పోలీసులు అక్క‌డకు చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.