బాబాయ్ నే కాదు.. అబ్బాయ్ ను కూడా లైన్లో పెట్టేశాడట!

05-05-2021 Wed 12:00
  • ముగింపు దశలో 'అఖండ'
  • గోపీచంద్ మలినేనికి గ్రీన్ సిగ్నల్
  • లైన్లో అనిల్ రావిపూడి ప్రాజెక్టు
  • ఆల్రెడీ 'పటాస్'తో హిట్ అందుకున్న కల్యాణ్ రామ్
Anil Raavipudi multi starrer movie with Balakrishna and kalyan Ram

బాలకృష్ణ అభిమానులందరి దృష్టి ఇప్పుడు 'అఖండ' సినిమాపై ఉంది. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని వాళ్లంతా కూడా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా తరువాత ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. 'క్రాక్' సినిమా చూసిన బాలకృష్ణ .. గోపీచంద్ మలినేని టేకింగ్ నచ్చేసి పిలిచి మరీ అవకాశం ఇచ్చారు.

ఇక ఈ సినిమా తరువాత ప్రాజెక్టును కూడా బాలకృష్ణ లైన్లో పెట్టేశారు. ఈ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించనున్నాడు. నిజానికి బాలకృష్ణ 100వ సినిమాను అనిల్ రావిపూడి చేయాలని చూశాడుగానీ కుదరలేదు. ఇక ఇప్పుడు అందుకు సమయం వచ్చింది. 'ఎఫ్ 3' పూర్తయిన తరువాత బాలకృష్ణ ప్రాజెక్టుపైనే అనిల్ రావిపూడి కూర్చోనున్నాడు.

ఈ సినిమాలో కల్యాణ్ రామ్ కూడా ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నాడని అంటున్నారు. గతంలో కల్యాణ్ రామ్ కి అనిల్ రావిపూడి 'పటాస్'తో పెద్ద హిట్ ఇచ్చాడు. మళ్లీ ఇంతకాలానికి ఈ కాంబినేషన్ కూడా వర్కౌట్ కానుంది. బాబాయ్ ను .. అబ్బాయ్ ను ఒకేసారి తెరపై చూడటమనేది నందమూరి అభిమానులకు ఆనందాన్ని కలిగించే విషయమని వేరే చెప్పాలా?