శంకర్ .. చరణ్ మూవీలో మరో స్టార్ హీరో!

05-05-2021 Wed 10:09
  • శంకర్ నుంచి మరో పాన్ ఇండియా మూవీ
  • చరణ్ కెరియర్లోనే భారీ బడ్జెట్
  • వివిధ భాషలకి చెందిన స్టార్స్ కి చోటు
  • కీలక పాత్రలో కన్నడ స్టార్ హీరో సుదీప్
Sudeep in Shankar and Charan movie

శంకర్ దర్శకత్వంలో చరణ్ ఒక భారీ సినిమాలో నటించనున్నాడనే విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన కథపైనే శంకర్ కసరత్తు చేస్తున్నాడు. ఇది పాన్ ఇండియా సినిమా కావడంతో, ఇతర భాషలకి చెందిన నటీనటులను తీసుకునే ప్రక్రియ కూడా ప్రారంభమైందనే టాక్ వినిపిస్తోంది.

ఇక ఈ సినిమాలోని ఒక కీలకమైన పాత్ర కోసం కన్నడ స్టార్ హీరో సుదీప్ ను తీసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. శంకర్ అతనికి కాల్ చేసి కథ చెప్పడం .. తన పాత్రను గురించి తెలుసుకున్న సుదీప్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయిందని అంటున్నారు.

సుదీప్ కు అనుకున్న పాత్రను శంకర్ చాలా కొత్తగా డిజైన్ చేశాడట. పాత్రలో కొత్తదనం ఉంటే సుదీప్ పెద్దగా ఆలోచన చేయడని అంటారు. పైగా ఇది శంకర్ సినిమా .. పాన్ ఇండియా సినిమా .. చరణ్ కెరియర్లోనే పెద్ద సినిమా కావడం వలన సుదీప్ వెంటనే ఓకే చెప్పేశాడని అంటున్నారు.

ఇక ప్రభాస్ కథానాయకుడిగా రూపొందుతోన్న 'ఆది పురుష్' సినిమాలో, రావణుడి సోదరుడైన విభీషణుడి పాత్రకి కూడా సుదీప్ నే అడుగుతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇందులో రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటించనున్న సంగతి తెలిసిందే.