తమిళనాడులో విషాదం.. ఆక్సిజన్ అందక 11 మంది కరోనా రోగుల మృతి

05-05-2021 Wed 08:12
  • చెంగల్‌పట్టు ప్రభుత్వ ఆసుపత్రిలో ఘటన
  • ఆక్సిజన్ సరఫరాలో అంతరాయంతోనే మరణాలు
  • లోపాన్ని గుర్తించే పనిలో అధికారులు
11 dead in tamilnadu chengalpattu due to interruption in oxygen supply

కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ సకాలంలో ఆక్సిజన్ అందక సంభవిస్తున్న మరణాల సంఖ్య పెరుగుతోంది. ప్రతి రోజూ ఎక్కడో ఓ చోట ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా తమిళనాడులోని చెంగల్‌పట్టు ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ ఉదయం ఇలాంటి ఘటనే జరిగింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగుల్లో 11 మంది ఆక్సిజన్ అందక మృతి చెందారు. ఆక్సిజన్ సరఫరాలో లోపం కారణంగానే మరణాలు సంభవించినట్టు గుర్తించారు. దీంతో లోపం ఎక్కడ జరిగిందో గుర్తించే పనిలో పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.