బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకుణేకు కరోనా పాజిటివ్

04-05-2021 Tue 22:00
  • ఇంట్లోనే ఐసొలేషన్ లో ఉన్న దీపిక  
  • ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు సమాచారం
  • కరోనా బారిన పడిన దీపిక మొత్తం కుటుంబం
Actress Deepika Padukone tests positive with corona

ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. తాజాగా ఆ జాబితాలోకి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకుణే కూడా చేరారు. దీపికకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆమె ఇంట్లోనే ఐసొలేషన్ లో ఉన్నారు. వైద్యులు సూచించిన ఔషధాలను ఆమె వాడుతున్నారు. దీపికకు కరోనా స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు సమాచారం.

మరోవైపు దీపిక కుటుంబం మొత్తం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. వారంతా బెంగళూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవలే దీపిక తన భర్త, సినీ నటుడు రణవీర్ సింగ్ తో కలిసి బెంగళూరులోని తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. ఈ నేపథ్యంలోనే దీపికకు కరోనా సోకినట్టు చెపుతున్నారు. అయితే, రణవీర్ కు కూడా కరోనా సోకిందా? లేదా? అనే విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం దీపిక షారుఖ్ ఖాన్ సరసన 'పఠాన్' చిత్రంలో నటిస్తోంది. మరోవైపు, నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించనున్న చిత్రంలో ప్రభాస్ సరసన నటించనుంది.