Trivikram Srinivas: త్రివిక్రమ్ .. మహేశ్ మూవీ టైటిల్ అదేనా?

Mahesh Babu upcoming movie title with Trivikram is Pardhu
  • మహేశ్ బాబు తో త్రివిక్రమ్ మూడో మూవీ
  • 'అతడు'లో మరిచిపోలేని 'పార్థు' పాత్ర
  • అభిమానుల్లో పెరుగుతున్న ఆసక్తి

త్రివిక్రమ్ .. మహేశ్ బాబు కాంబినేషన్లో ఒక సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో 'అతడు' .. 'ఖలేజా' సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు కూడా విభిన్నమైన కథాకథనాలతో సాగుతాయి. అందువలన ఈ ఇద్దరి కాంబినేషన్లో నిర్మితం కానున్న మూడో సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా టైటిల్ పై ఆందరిలో ఆసక్తి నెలకొంది.

త్రివిక్రమ్ తన సినిమా టైటిల్స్ 'అ' అనే అక్షరంతో మొదలయ్యేలా చూసుకుంటాడు. 'అల వైకుంఠపురములో' సినిమా తరువాత, ఆయన ఎన్టీఆర్ తో చేయనున్నాడనుకున్న సినిమాకి కూడా 'అయిననూ పోయిరావలే హస్తినకు' అనే టైటిల్ వినిపించింది. అందువలన మహేశ్ బాబుతో చేయనున్న సినిమాకి కూడా 'అ' అనే అక్షరంతోనే టైటిల్ మొదలవుతుందని అనుకున్నారు. కానీ తాజాగా 'పార్థు' టైటిల్ తెరపైకి వచ్చింది. 'అతడు' సినిమాలో మహేశ్ బాబు పాత్ర పేరు ఇది. ఈ సినిమాకి ఈ టైటిల్ నే అనుకున్నారని చెప్పుకుంటున్నారు. వాస్తవమెంతన్నది చూడాలి మరి.

Trivikram Srinivas
Mahesh Babu
Pardhu Movie

More Telugu News