JEE Mains: కరోనా ఎఫెక్ట్... జేఈఈ మెయిన్స్ పరీక్ష వాయిదా

  • భారత్ లో కరోనా కల్లోలం
  • నిత్యం లక్షల్లో పాజిటివ్ కేసులు
  • ఇప్పటికే పలు పరీక్షలు వాయిదా
  • ఈ నెల 24 నుంచి జరగాల్సిన జేఈఈ మెయిన్స్
  • తదుపరి తేదీలు త్వరలోనే ప్రకటిస్తామన్న ఎన్టీయే
JEE Mains postpone due to covid pandemic

భారత్ లో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం అన్ని రంగాలను చుట్టుముడుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా విద్యాసంస్థల కార్యకలాపాలు నిలిచిపోగా, కీలక పరీక్షలు సైతం వాయిదా పడ్డాయి. తాజాగా జేఈఈ మెయిన్స్ పరీక్ష వాయిదా వేశారు. ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 24 నుంచి 28వ తేదీ వరకు జేఈఈ మెయిన్స్ జరగాల్సి ఉంది.

అయితే, కరోనా వ్యాప్తి అత్యంత తీవ్రస్థాయిలో ఉండడంతో వాయిదా వేస్తున్నట్టు ఎన్టీఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) పేర్కొంది. తదుపరి పరీక్షల తేదీలు త్వరలో ప్రకటిస్తామని వెల్లడించింది. 'ఎన్టీయే అభ్యాస్ యాప్' ద్వారా ఇంటి వద్ద నుంచే పరీక్షలకు సిద్ధం కావాలని సూచించింది.

More Telugu News