Etela Rajender: ఈట‌ల అధీనంలో ఉన్న భూముల‌ను ప‌రిశీలిస్తోన్న అధికారులు

collector inquires on etela land
  • దేవరయంజాల్ గ్రామంలోని భూముల సందర్శన‌
  • గోదాంలను ప‌రిశీలించిన‌ మేడ్చల్ జిల్లా కలెక్టర్
  • సీతారామస్వామి దేవాలయానికి చెందిన భూముల ప‌రిశీల‌న
తెలంగాణ‌లో హాట్ టాపిక్‌గా మారిన మెదక్‌ జిల్లా అచ్చంపేట భూముల వ్యవహారంలో అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తించిన విష‌యం తెలిసిందే. దీనిపై ఈ రోజు కూడా అధికారులు ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు. రంగారెడ్డి జిల్లా శామీర్ పేట మండలంలోని దేవరయంజాల్ గ్రామంలోని భూములను సందర్శించారు.

అక్క‌డ‌ మాజీ మంత్రి ఈటల రాజేందర్ అధీనంలో ఉన్న భూముల్లోని గోదాంలను మేడ్చల్ జిల్లా కలెక్టర్ శ్వేతామహంతితో పాటు రెవెన్యూ, విజిలెన్స్ అధికారులు పరిశీలించారు. అలాగే, సీతారామస్వామి దేవాలయానికి చెందిన భూములను పరిశీలిస్తున్నారు. ఈట‌ల క‌బ్జా ఆరోప‌ణ‌ల‌పై త‌దుప‌రి ద‌ర్యాప్తు కొన‌సాగుతోంది. మ‌రోవైపు, ఈటల కుటుంబ స‌భ్యులు  హైకోర్టును ఆశ్రయించి  త‌మ భూముల్లో జోక్యం చేసుకోకుండా అధికారులను ఆదేశించాలని కోరిన విష‌యం తెలిసిందే.  

Etela Rajender
TRS
Telangana

More Telugu News