Dhulipala Narendra Kumar: సంగం డైరీ ఎండీకి జైలులో క‌రోనా సోకిన వైనం.. నేడు ధూళిపాళ్ల‌కు కొవిడ్ ప‌రీక్ష‌లు

sangan dairy md tests postive
  • సంగం డెయిరీలో అవకతవకలకు పాల్పడిన‌ ఆరోపణలపై అరెస్టు
  • నిన్న మధ్యాహ్నం సంగం డైరీ ఎండీకి క‌రోనా లక్షణాలు
  • ఈ రోజు సహకారశాఖ మాజీ అధికారి గురునాథానికి కూడా క‌రోనా ప‌రీక్ష‌లు
సంగం డెయిరీలో అవకతవకలకు పాల్పడిన‌ ఆరోపణలపై టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర, సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్‌, సహకారశాఖ మాజీ అధికారి గురునాథం అరెస్ట‌యిన విష‌యం విదిత‌మే. ప్ర‌స్తుతం వారి ఆరోగ్య ప‌రిస్థితి బాగోలేద‌న్న విష‌యంపై ప్ర‌చారం జ‌రుగుతోన్న వేళ దీనిపై జైలు సూపరింటెండెంట్‌ రాజారావు స్పందిస్తూ పూర్తి వివ‌రాలు తెలిపారు.

గోపాలకృష్ణన్‌కు కరోనా నిర్ధారణ అయింద‌ని, దీంతో ఆయనకు రాజమహేంద్రవరం ప్రభుత్వ కొవిడ్ ఆసుప‌త్రిలో చికిత్స అందిస్తున్నట్లు వివ‌రించారు. ఆయ‌న‌లో నిన్న మధ్యాహ్నం క‌రోనా లక్షణాలు క‌న‌ప‌డ్డాయ‌ని, శ్వాస తీసుకోవడానికి ఇబ్బందులు త‌లెత్తాయ‌ని అందుకే జైలు అధికారులు నిన్న రాత్రి క‌రోనా పరీక్షలు చేయించార‌ని ఆయ‌న చెప్పారు.

దీంతో ఆయ‌న‌కు పాజిటివ్‌గా తేలింద‌ని వివరించారు. అలాగే, జైలులో ఉన్న సహకారశాఖ మాజీ అధికారి గురునాథం పాటు ధూళిపాళ్ల నరేంద్రకు ఈ రోజు క‌రోనా పరీక్షలు చేయిస్తామని చెప్పారు.


Dhulipala Narendra Kumar
Telugudesam
YSRCP

More Telugu News