మరో రీమేక్ పట్ల ఆసక్తిని చూపుతున్న వెంకటేశ్?

04-05-2021 Tue 11:57
  • విడుదలకి సిద్ధమైన 'నారప్ప'
  • షూటింగు పూర్తిచేసుకున్న 'దృశ్యం 2'
  • మలయాళంలో హిట్ కొట్టిన 'డ్రైవింగ్ లైసెన్స్'

Venkatesh is excited to do another remake movie

మొదటి నుంచి కూడా రీమేక్ సినిమాలు చేయడంలో వెంకటేశ్ ఉత్సాహాన్ని చూపుతూ వస్తున్నారు. కథ .. కథనం బావుండాలి, తన బాడీ లాంగ్వేజ్ కి సరిపోతుంది అనుకుంటే ఆయన వెంటనే రంగంలోకి దిగిపోతూ ఉంటారు. తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషలలోని సినిమాలపై ఆయన ఎప్పుడూ ఒక కన్నేసే ఉంచుతారు. తాజాగా ఆయన తమిళంలో సక్సెస్ అయిన 'అసురన్' రీమేక్ గా 'నారప్ప' చేశారు. అలాగే మలయాళంలో విజయవంతమైన 'దృశ్యం 2' రీమేక్ లోను చేశారు. ఈ రెండు సినిమాలు కూడా విడుదలకు ముస్తాబవుతూ ఉన్నాయి.

ఇక తాజాగా ఆయన మరో మలయాళ సినిమా రీమేక్ లో చేయడానికి ఆసక్తిని చూపుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు. కొంతకాలం క్రితం మలయాళంలో 'డ్రైవింగ్ లైసెన్స్' అనే సినిమా వచ్చింది. లాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ - సూరజ్ నటించారు. ఈ సినిమా విజయంతో పాటు ప్రశంసలు అందుకుంది. అందువలన ఈ సినిమా పట్ల వెంకటేశ్ ఉత్సాహంగా ఉన్నారని అంటున్నారు. ఈ సినిమా సురేశ్ బాబుకి కూడా నచ్చితే, పట్టాలెక్కడానికి పెద్ద సమయం పట్టదనే చెప్పాలి.