దేశంలో వరుసగా మూడో రోజూ తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు

04-05-2021 Tue 11:18
  • గత 24 గంటల్లో 3.57 లక్షల మందికి కరోనా
  • 3,449 మంది మృతి
  • కరోనా నుంచి కోలుకున్న 3.20 లక్షల మంది
  • యాక్టివ్ కేసుల సంఖ్య 34,47,133
Corona cases number declines in country

గత కొన్నిరోజులుగా కరోనా సునామీని చవిచూసిన భారత్ లో గత మూడు రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,57,229 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 3,20,289 మంది కోలుకోగా... 3,449 మంది మరణించారు. దాంతో మరణాల సంఖ్య 2,22,408కి పెరిగింది.  

ఇక, తాజా కేసులతో కలిపి దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2 కోట్లు దాటింది. ఇప్పటివరకు భారత్ లో 2,02,82,833 కరోనా కేసులు నమోదయ్యాయి. 1,66,13,292 మంది కరోనా నుంచి విముక్తులవగా, ఇంకా 34,47,133 మందికి చికిత్స జరుగుతోంది. కరోనా వ్యాక్సినేషన్ విషయానికొస్తే... 15,89,32,921 మందికి టీకాలు వేశారు.