'అఖండ' నుంచి ట్రైలర్ వచ్చేది అప్పుడేనట!

04-05-2021 Tue 11:16
  • బోయపాటితో బాలయ్య మూడో మూవీ
  • టీజర్ కి వచ్చిన అనూహ్యమైన రెస్పాన్స్
  • అభిమానుల్లో పెరుగుతున్న అంచనాలు  

Akhanda trailer will be released on May 28

బాలకృష్ణ .. బోయపాటి కాంబినేషన్లో మూడో సినిమాగా 'అఖండ' రూపొందుతోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'సింహా' .. 'లెజెండ్' సినిమాలు సంచలన విజయాలను రాబట్టడంతో, సహజంగానే 'అఖండ'పై అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ చాలావరకూ పూర్తయింది. ఇటీవల వదిలిన టీజర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. దాంతో బాలయ్య అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ కొడుతుందనే నమ్మకంతో ఉన్నారు.  

ఈ జోరులో ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. తమన్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఫస్ట్ సింగిల్ కోసం అభిమానులు ఆతృతతో ఎదురుచూస్తున్నారు. ఇక ట్రైలర్ ను ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మే 28వ తేదీన విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట. నిజానికి ఆ రోజునే సినిమాను విడుదల చేయాలనుకున్నారుగానీ కుదరడం లేదట. అందువల్లనే ఆ రోజున ట్రైలర్ ను ప్లాన్ చేసినట్టుగా చెప్పుకుంటున్నారు.