Corona Virus: ఇదొక్కటే మార్గం... రక్షిస్తున్న టీకా!

  • ప్రజల్లో అపోహలు వద్దు
  • టీకా రక్షణ ఇస్తుందనడంలో సందేహం లేదు
  • టీకా తీసుకున్న వారిలో కొత్త కేసులు 6 శాతం
  • మరణాలు శూన్యమన్న వైద్య నిపుణులు
Definetly Vaccine Will Protect from Corona

కరోనా నుంచి తప్పించుకోవాలంటే కేవలం టీకా వేయించుకోవడం ఒక్కటే మార్గమని వైద్యులు స్పష్టంగా చెబుతున్నారు. ఈ మేరకు ప్రజల్లో ఉన్న అపోహలను తొలగిస్తూ, టీకా రెండు డోస్ లు తీసుకున్న వారిలో కరోనా పాజిటివ్ వస్తున్న వారి సంఖ్య గణనీయంగా పడిపోయింది. కరోనా నుంచి రక్షణ విషయంలో టీకా పూర్తి భరోసాను ఇస్తుందనడంలో సందేహం లేదని తమ పరిశీలనలో వెల్లడైనట్టు వైద్యులు అంటున్నారు.

ఇంతవరకూ ఇండియాలో ఫ్రంట్ లైన్ వర్కర్లతో పాటు, హెల్త్ కేర్ వర్కర్లు, 45 ఏళ్లు దాటిన వారికి టీకాను ఇస్తుండగా, వీరిలో రెండు డోస్ లు తీసుకున్న వారిలో 2 వారాల తరువాత కేవలం 6 శాతం మాత్రమే కేసులు వచ్చాయని, వారు కూడా రెండుమూడు రోజుల్లోనే కోలుకున్నారని అంటున్నారు.ఇక మరణాల విషయంలో రెండో డోస్ కూడా తీసుకున్న వారు ఒక్కరు కూడా లేరని, ఏప్రిల్ 10 నుంచి 30 వరకూ జరిపిన తమ పరిశీలనలో ఈ విషయం వెల్లడైందని వైద్య నిపుణులు పేర్కొన్నారు.

ఇక ప్రాంతాల వారీగా ఉదాహరణలను పరిశీలిస్తే, కృష్ణా జిల్లా కైకలూరు ప్రాంతంలో 200 మంది పోలీసులకు రెండు డోస్ ల టీకాను ఇచ్చారు. కరోనా కేసులు ఉధ్ధృతంగా పెరిగిన ఈ సమయంలోనూ వీరిలో ఒక్కరికి కూడా వైరస్ సోకలేదు. దీంతో వీరంతా నిర్భయంగా విధులను నిర్వహిస్తూ, మహమ్మారి నియంత్రణకు తమవంతు సహకారాన్ని అందిస్తున్నారు. ఇక జిల్లా పరిధిలోని వైద్యులు, ఫ్రంట్ కేర్ వర్కర్లలో టీకా తీసుకున్న ప్రతి 1000 మందిలో ఒక్కరికి కూడా కరోనా సోకలేదని అధికారులు అంటున్నారు.

ఇదిలావుండగా, తాము తాజా గణాంకాలను పరిశీలించామని, రెండు డోస్ లు తీసుకున్న తరువాత కూడా మహమ్మారి సోకిన వారిని అబ్జర్వ్ చేస్తే, వారిలో స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపించాయని, వారిలో మృతి చెందే ప్రమాదం ఎంతమాత్రమూ లేదని హృద్రోగ నిపుణులు సూచించారు.

More Telugu News