హైదరాబాద్ జూపార్కులో సింహాలకు కరోనా లక్షణాలు!

04-05-2021 Tue 10:31
  • జంతు ప్రదర్శనశాలలో కరోనా కలకలం
  • హైదరాబాద్ జూలో 8 సింహాలకు కరోనా తరహా లక్షణాలు
  • నమూనాలు సేకరించి సీసీఎంబీకి పంపిన అధికారులు
  • ఈ సాయంత్రం రిపోర్టులు వచ్చే అవకాశం
  • ఈ నెల 2 నుంచే జూ మూసివేత
Lions in Hyferabad Zoo suffers with corona type symptoms

కరోనా మహమ్మారి హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్కులోనూ కలకలం రేపుతోంది. హైదరాబాద్ జూ పార్కులో 8 సింహాలు కరోనా తరహా లక్షణాలతో బాధపడుతున్నట్టు అధికారులు గుర్తించారు. ఈ సింహాల నుంచి నమూనాలు సేకరించిన అధికారులు, ఆ నమూనాలను సీసీఎంబీ (సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ)కి పంపించారు. సింహాల కొవిడ్ పరీక్షల రిపోర్టులు ఇవాళ వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అధికారులు ఈ నెల 2 నుంచే జూ పార్కును మూసివేశారు.