తల్లి దయాలు అమ్మాళ్ ఆశీస్సులు అందుకున్న డీఎంకే చీఫ్ స్టాలిన్

04-05-2021 Tue 10:05
  • భార్యతో కలిసి గోపాలపురంలోని తల్లి ఇంటికి వెళ్లిన స్టాలిన్
  • హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానించిన సోదరి
  • మార్గమధ్యంలో రోడ్డు పక్కన నిల్చున్న బాల్య స్నేహితుడిని పలకరించిన స్టాలిన్
DMK Chief MK Stalin take blessings from mother Dayalu Ammal

తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ తల్లి నుంచి ఆశీర్వాదం అందుకున్నారు. నిన్న ఉదయం తన తల్లి దయాలు అమ్మాళ్ నివసిస్తున్న గోపాలపురంలోని ఇంటికి వెళ్లిన స్టాలిన్‌ దంపతులకు సోదరి సెల్వి హారతులు ఇచ్చి టెంకాయ కొట్టి లోనికి ఆహ్వానించారు.

అనంతరం తల్లికి నమస్కరించి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం అన్నా అరివాలయానికి బయలుదేరారు. ఈ క్రమంలో రోడ్డు పక్కన నిల్చుని కనిపించిన తన బాల్యమిత్రుడు రామచంద్రన్‌ను చూసి కారు దిగి పలకరించారు. అతడి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.