తిరుమల శ్రీవారి ఆస్థాన మండపం వద్ద అగ్ని ప్రమాదం

04-05-2021 Tue 07:40
  • ఈ ఉదయం ప్రమాదం
  • మంటల్లో కాలి బూడిదైన ఆరు దుకాణాలు
  • మంటలు అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది
Fire Accident in tirumala

తిరుమలలోని శ్రీవారి ఆస్థాన మండపం వద్దనున్న దుకాణాల్లో ఈ ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో ఆరు దుకాణాలు మంటలకు ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.