ముంబై పోలీసులు వేధిస్తున్నారంటూ హైకోర్టును ఆశ్రయించిన ఐపీఎస్ అధికారిణి రష్మీ శుక్లా

04-05-2021 Tue 07:28
  • గతంలో మహారాష్ట్ర నిఘా విభాగాధిపతిగా సేవలు
  • అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని అభియోగాలు
  • వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని పోలీసుల నోటీసులు
  • రష్మీ శుక్లా పిటిషన్‌పై వివరణ ఇవ్వాలంటూ ముంబై పోలీసులకు కోర్టు నోటీసులు
Shukla moves Hyderabad High Court against Mumbai Police

హైదరాబాద్‌లో సీఆర్‌పీఎఫ్ అదనపు డీజీగా ఉన్న మహారాష్ట్ర ఐపీఎస్ అధికారిణి ముంబై పోలీసులపై తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. నిఘా విభాగాధిపతిగా ఉన్న సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ ముంబైలో ఆమెపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ పోలీసులు నోటీసులు పంపారు.

దీంతో ఆమె కోర్టుకు వెళ్లారు. ప్రస్తుత కరోనా సమయంలో విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని ముంబై పోలీసులు వేధిస్తున్నారని కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. స్పందించిన న్యాయస్థానం  ఆమె పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని ముంబై పోలీసులకు నోటీసులు జారీచేసింది. రష్మీ శుక్లా పిటిషన్‌పై రేపు విచారణ జరగనుంది.