కరోనా టెస్ట్ లో నాన్నకు నెగెటివ్ వచ్చింది: సబ్బం హరి కుమారుడు వెంకట్

03-05-2021 Mon 19:32
  • ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వల్ల నాన్న చనిపోయారు
  • ఎన్నికల కారణంగా వ్యాక్సిన్ తీసుకోలేకపోయారు
  • నాన్న ఆరోగ్యం గురించి వెంకయ్యనాయడు, చంద్రబాబు ఫోన్లు చేసేవారు
My father tested negetive in Covid testing says Sabbam Haris son

కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ, ప్రముఖ రాజకీయ నాయకుడు సబ్బం హరి ఈరోజు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్ల పలువురు నేతలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మరోవైపు సబ్బం హరి కుమారుడు వెంకట్ మాట్లాడుతూ, ఊపిరతిత్తుల్లో ఇన్ఫెక్షన్ వల్లే తన తండ్రి మరణించారని తెలిపారు. ఈ మధ్యాహ్నం 1.22 గంటలకు తన తండ్రి తుదిశ్వాస విడిచారని చెప్పారు. నాన్నకు కరోనా టెస్టులో నెగెటివ్ వచ్చిందని తెలిపారు. కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని అనుకున్నారని... అయితే, ఎన్నికల కారణంగా తీసుకోలేకపోయారని చెప్పారు.

రేపు ఉదయం 9 గంటల తర్వాత కేఆర్ఎం కాలనీ శ్మశానవాటికలో అంత్యక్రియలను నిర్వహిస్తామని వెంకట్ తెలిపారు. కరోనా తీవ్రత నేపథ్యంలో అంత్యక్రియలకు ఎవరూ రావద్దని ఆయన కోరారు. ఎవరైనా రావాలనుకుంటే... అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. నాన్న ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్లు చేసి ఆరోగ్యం గురించి వాకబు చేసేవారని తెలిపారు.