మహేశ్ తరువాత పవన్ తోనే త్రివిక్రమ్ ప్రాజెక్ట్!

03-05-2021 Mon 18:30
  • సెట్స్ పై రెండు సినిమాలు ఉంచిన పవన్
  • లైన్లో హరీశ్ శంకర్ ప్రాజెక్టు  
  • మహేశ్ సినిమాను పూర్తి చేయనున్న త్రివిక్రమ్  

Another project in Trivikram and Pavan kalyan Combo

త్రివిక్రమ్ తన తాజా చిత్రాన్ని మహేశ్ బాబుతో చేయనున్నాడు. అందుకు సంబంధించిన సన్నాహాలను చేసుకుంటున్నాడు. ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో మహేశ్ బాబు 'సర్కారువారి పాట' సినిమా చేస్తున్నాడు. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగు ఆగిపోయింది. పరిస్థితులు అనుకూలించిన తరువాతనే తిరిగి షూటింగు మొదలవుతుంది. మహేశ్ బాబు డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. అందువలన ఈ సినిమా షూటింగు పూర్తయిన తరువాతనే త్రివిక్రమ్ సినిమా షూటింగు మొదలుకానుంది.

మహేశ్ బాబుతో తన సినిమాను పూర్తి చేసిన త్రివిక్రమ్, ఆ తరువాత పవన్ తో సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఇటీవలే ఈ టాక్ బయటికి వచ్చింది. ఆ వార్త నిజమేనని చెప్పుకుంటున్నారు. హారిక అండ్ హాసిని బ్యానర్లో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. ప్ర్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో 'హరిహర వీరమల్లు' .. 'సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో మలయాళ సినిమా రీమేక్ లో పవన్ చేస్తున్నాడు. ఆ తరువాత హరీష్ శంకర్ ప్రాజెక్టు లైన్లో ఉంది. ఈ మూడు సినిమాలు పూర్తయిన తరువాతనే పవన్ - త్రివిక్రమ్ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని అంటున్నారు.