ఫ్లాట్ గా ముగిసిన మార్కెట్లు

03-05-2021 Mon 17:10
  • మార్కెట్లను వెంటాడిన కరోనా భయాలు
  • 63 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 3 పాయింట్ల లాభంతో ముగిసిన నిఫ్టీ
Markets ends in flat mode

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ఫ్లాట్ గా ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే మార్కెట్లు లాభాల్లోకి వెళ్లినప్పటికీ... అవి ఎంతో సేపు నిలవలేదు. కరోనా భయాలు ఇన్వెస్టర్లను వెంటాడాయి. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తారనే ఆందోళనలు మార్కెట్ పై తీవ్ర ప్రభావం చూపాయి.  ఈ నేపథ్యంలో, ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 63 పాయింట్లు కోల్పోయి 48,718కి పడిపోయింది. నిఫ్టీ 3 పాయింట్ల లాభంతో 14,634 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
భారతి ఎయిర్ టెల్ (3.98%), హిందుస్థాన్ యూనిలీవర్ (2.27%), మారుతి సుజుకి (2.14%), బజాజ్ ఫైనాన్స్ (1.82%), ఏసియన్ పెయింట్స్ (1.69%).

టాప్ లూజర్స్:
టైటాన్ కంపెనీ (-4.58%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.24%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-1.76%), యాక్సిస్ బ్యాంక్ (-1.61%), కొటక్ మహీంద్రా బ్యాంక్ (-1.39%).