'గజిని' సీక్వెల్లో అల్లు అర్జున్?

03-05-2021 Mon 17:05
  • 'పుష్ప'సినిమాతో రానున్న అల్లు అర్జున్
  • నెక్స్ట్ ప్రాజెక్టుపై అభిమానుల్లో ఆసక్తి
  • తెరపైకి మురుగ దాస్ పేరు      

Muruga Doss Ghajini 2 moviewith Allu Arjun

చాలాకాలం క్రితం సూర్య హీరోగా 'గజిని' వచ్చిన విషయం తెలిసిందే. మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, సూర్య కెరియర్లోనే చెప్పుకోదగిన చిత్రంగా నిలిచింది. తెలుగులోనూ భారీ వసూళ్లను రాబట్టడమే కాకుండా, ఇక్కడ సూర్యకి ప్రత్యేకమైన బేస్ ను ఏర్పాటు చేసింది. అలాంటి ఆ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ రూపొందనున్నట్టుగా, ఆ సీక్వెల్లో అల్లు అర్జున్ చేయనున్నట్టుగా వార్తలు షికారు చేస్తున్నాయి. ఇందుకు సంబంధించిన కథపై మురుగదాస్ కసరత్తు చేస్తున్నట్టుగా చెబుతున్నారు.

ఒక వైపున ఎన్టీఆర్ తో కొరటాల .. మరో వైపున మహేశ్ బాబుతో త్రివిక్రమ్ ప్రాజెక్టులు ఖరారయ్యాయి. బన్నీకి బాగా సన్నిహితుడైన సురేందర్ రెడ్డి అందుబాటులో లేడు. మిగతావాళ్లతో బన్నీ చేసే పరిస్థితులు లేవు. ఈ నేపథ్యంలో బన్నీ ఏ దర్శకుడితో తన సినిమాను ప్లాన్ చేసుకుంటాడనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు మురుగదాస్ పేరు తెరపైకి వచ్చింది. పూర్తిగా కొత్త కథతో .. 'గజిని 2' పేరుతో ఈ సినిమా రూపొందవచ్చని అంటున్నారు. త్వరలో అధికారిక ప్రకటన వెలువడవచ్చని చెప్పుకుంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.