చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కరోనా గందరగోళం... మొదటి టెస్టులో పాజిటివ్, రెండో టెస్టులో నెగెటివ్!

03-05-2021 Mon 16:41
  • ఐపీఎల్ పై కరోనా మేఘాలు
  • కోల్ కతా జట్టులో ఇద్దరికి పాజిటివ్
  • చెన్నై జట్టులోనూ కలకలం
  • ఆటగాళ్లందరికీ నెగెటివ్
  • సీఈఓ, బౌలింగ్ కోచ్, బస్ క్లీనర్ లకు పాజిటివ్
  • నేడు పరీక్షలు నిర్వహిస్తే కరోనా లేదని వెల్లడి
Corona positive cases in Chennai Super Kings team

ఐపీఎల్ టోర్నీపై కరోనా పంజా విసురుతోంది. ఇప్పటికే కోల్ కతా నైట్ రైడర్స్ టీమ్ కు చెందిన వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ కరోనా బారినపడగా, తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోనూ కొవిడ్ కలకలం రేగింది. ఆ జట్టు మొత్తానికి కరోనా పరీక్షలు నిర్వహించగా, ఆటగాళ్లెవరికీ కరోనా సోకలేదని వెల్లడైంది.

అయితే చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథన్, బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ, బస్ క్లీనర్ కు తొలుత కరోనా పాజిటివ్ అని తేలింది. కానీ తాజాగా నిర్వహించిన పరీక్షల్లో వారికి నెగెటివ్ అని వచ్చింది. దాంతో ఏది నమ్మాలో అర్థంకాని పరిస్థితిలో సీఎస్కే యాజమాన్యం అయోమయానికి గురవుతోంది. దీనిపై బీసీసీఐ వర్గాలు స్పందించాయి. చెన్నై జట్టు సభ్యులకు పొరబాటున పాజిటివ్ అని వచ్చి ఉంటుందని పేర్కొన్నాయి.