నేను కోలుకుంటున్నా... ఎవరూ ఆందోళన చెందవద్దు: అల్లు అర్జున్

03-05-2021 Mon 15:11
  • ఇటీవలే అల్లు అర్జున్ కు కరోనా పాజిటివ్
  • హోం ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స
  • స్వల్ప లక్షణాలు ఉన్నాయన్న బన్నీ
  • ఇప్పటికీ క్వారంటైన్ లోనే ఉన్నట్టు వెల్లడి
  • తన కోసం ప్రార్థిస్తున్న వారికి కృతజ్ఞతలు
Allu Arjun says he recovers well from corona mild symptoms

టాలీవుడ్ అగ్రహీరో అల్లు అర్జున్ తన ఆరోగ్య పరిస్థితిపై తాజా సమాచారం వెల్లడించారు. ఇటీవలే కరోనా బారినపడిన అల్లు అర్జున్ హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు. తాజాగా ఓ ప్రకటనలో స్పందించారు. తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని, క్రమంగా కోలుకుంటున్నాని తెలిపారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

తానింకా క్వారంటైన్ లోనే ఉన్నానని అల్లు అర్జున్ వెల్లడించారు. తాను కరోనా బారినపడ్డానని తెలియగానే విశేష ప్రేమాభిమానాలు కురిపిస్తూ, తన కోసం ప్రార్థిస్తున్న అందరికీ కృతజ్ఞతలు అని తెలిపారు.