Balakrishna: అనంతపురం జనరల్ ఆసుపత్రిలో కరోనా మృత్యుఘంటికలు... బాలకృష్ణ స్పందన

  • జిల్లా జనరల్ ఆసుపత్రిలో ఒక్కరోజే 15 మంది మృతి
  • ఆక్సిజన్ లోపమే కారణమని ఆరోపణలు
  • కరోనా తీవ్రత వల్లే చనిపోయారంటున్న కలెక్టర్
  • పెద్ద సంఖ్యలో చనిపోవడం బాధాకరమన్న బాలయ్య
  • రూ.25 లక్షలు ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వానికి సూచన
Balakrishna responds to large number of deaths in Ananthapur hospital

అనంతపురం జనరల్ ఆసుపత్రిలో ఒక్కరోజే 15 మంది మృత్యువాత పడడం తీవ్ర కలకలం రేపుతోంది. చనిపోయిన వారిలో ఒకరు బ్రెయిన్ డెడ్ అని, మిగతా వారు కరోనా రోగులని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు వివరించారు. అనంతపురం జనరల్ ఆసుపత్రిలో రెండ్రోజులుగా ఆక్సిజన్ సమస్య ఏర్పడిందని, ఆక్సిజన్ సరఫరాలో సమస్య వల్లే కరోనా రోగులు మృతి చెందినట్టు వారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కలెక్టర్ గంధం చంద్రుడు మాత్రం వారు కొవిడ్ తీవ్రత కారణంగానే మరణించినట్టు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందించారు. జిల్లా కొవిడ్ ఆసుపత్రిలో ఒక్కరోజే పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబాల పరిస్థితిని తాను అర్థం చేసుకోగలనని, వారికి తన ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నట్టు వెల్లడించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.25 లక్షల చొప్పున సాయం చేసి ఆదుకోవాలని అన్నారు.

More Telugu News