AP High Court: ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుకు హైకోర్టులో ఊర‌ట‌

high court gives anticipatory bail
  • ఏపీలో నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలు జ‌రిగాయ‌ని ఆరోప‌ణ‌లు
  • ఇప్ప‌టికే కమిషనరాఫ్ ఎంక్వైరీస్ విచార‌ణ పూర్తి
  • అరెస్టు చేయ‌కుండా ఆదేశాలు ఇవ్వాల‌ని ఏబీవీ పిటిష‌న్‌
  • ముంద‌స్తు బెయిల్ మంజూరు
ఏపీలో నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలు జ‌రిగాయ‌ని, సర్వీస్‌ నిబంధనలు అతిక్రమించి నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలపై ఐపీఎస్‌ అధికారి, ఏపీ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావుపై విచార‌ణ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఆయ‌న‌పై ఉన్న‌ ఆరోప‌ణ‌ల‌పై కమిషనరాఫ్ ఎంక్వైరీస్ ఏబీ వెంకటేశ్వరరావుపై ఇటీవ‌లే 14 రోజుల విచార‌ణ పూర్తి చేసింది.

అయితే, త‌న‌ను అరెస్టు చేయ‌కుండా ఆదేశాలు ఇవ్వాల‌ని హైకోర్టు ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు ఇటీవ‌ల పిటిష‌న్ వేశారు. దీంతో ఆయ‌న‌కు ఊర‌ట ల‌భించింది. ఆయ‌న పిటిష‌న్‌పై విచార‌ణ జ‌రిపిన హైకోర్టు ముంద‌స్తు బెయిల్ మంజూరు చేసింది.

AP High Court
bail
AB Venkateswara Rao

More Telugu News