క‌రోనా రోగుల‌కు సాయం చేసేందుకు 'చిరంజీవి చారిటేబుల్ ఫౌండేష‌న్' ద్వారా మెగాస్టార్ చొర‌వ

03-05-2021 Mon 13:20
  • ప్లాస్మా దానం చేయాల‌ని పిలుపు
  • 94400 55777కు ఫోను చేయాల‌ని సూచ‌న‌
  • ప్లాస్మాతో మరో నలుగురిని ర‌క్షించొచ్చ‌ని వ్యాఖ్య
donate plasma says chiru

క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో రోగుల‌కు త‌న వంతు సాయం చేసేందుకు మెగాస్టార్ చిరంజీవి చొర‌వ చూపిస్తున్నారు. క‌రోనా చికిత్స‌కు కొవిడ్ నుంచి కోలుకున్న రోగుల ప్లాస్మా ఉప‌యోగ‌ప‌డుతోన్న విష‌యం తెలిసిందే. దీంతో ప్లాస్మా దానానికి ముందుకు రావాల‌ని చిరు పిలుపునిచ్చారు. ప్లాస్మా దానం చేయాల‌నుకున్న వారు చిరంజీవి చారిటేబుల్ ఫౌండేష‌న్ నంబ‌రు 94400 55777కు ఫోను చేయాల‌ని ఆయ‌న పిలుపు నిచ్చారు.

క‌రోనా సెకండ్‌ వేవ్‌ చాలా మందిపై ప్రభావం చూపుతుందనే సంగతి మీ అందరికీ తెలిసిందేన‌ని, కొన్నిరోజుల ముందు కొవిడ్‌ నుంచి కోలుకున్న వారు  ప్లాస్మాను దానం చేయడానికి ముందుకు రావాల‌ని ఆయ‌న చెప్పారు. ప్లాస్మాతో మరో నలుగురు కొవిడ్‌ను సమర్థ‌వంతంగా ఎదుర్కోగలరని ఆయ‌న చెప్పారు.