తెలంగాణలో మినీ పోరు ఫ‌లితాల్లో టీఆర్ఎస్ హ‌వా

03-05-2021 Mon 12:58
  • వ‌రంగ‌ల్ కార్పొరేష‌న్‌లో మొత్తం 66 డివిజ‌న్లు
  • 16 టీఆర్ఎస్‌, ఏడు బీజేపీ, రెండు కాంగ్రెస్ సొంతం
  • మిగ‌తా స్థానాల్లో కౌంటింగ్
  • జడ్చర్ల మునిసిపాలిటీ టీఆర్ఎస్‌ కైవసం
  • కొత్తూరు మునిసిపాలిటీ కూడా టీఆర్ఎస్‌కే
trs lead in mini fight

తెలంగాణ మినీ పురపోరు ఓట్ల లెక్కింపు కొన‌సాగుతోంది. ఇటీవ‌ల రాష్ట్రంలోని  ఖమ్మం, గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్లతో పాటు సిద్ధిపేట, కొత్తూరు, జడ్చర్ల, అచ్చంపేట, నకిరేకల్ పురపాలికలకు ఎన్నిక‌లు జ‌రిగిన విష‌యం తెలిసిందే.

వ‌రంగ‌ల్ కార్పొరేష‌న్‌లో మొత్తం 66 డివిజ‌న్ల‌లో 16 టీఆర్ఎస్‌, ఏడు బీజేపీ, రెండు కాంగ్రెస్, ఇత‌రులు ఒక‌టి గెలుచుకున్నారు. మిగ‌తా స్థానాల్లో కౌంటింగ్ కొన‌సాగుతోంది. ఖ‌మ్మం కార్పొరేష‌న్‌లో మొత్తం 60 డివిజ‌న్ల‌లో టీఆర్ఎస్ 15, కాంగ్రెస్ ఐదు, బీజేపీ ఒక్క స్థానంలో గెలుపొందాయి.

జ‌డ్చ‌ర్ల‌లో మొత్తం 27 వార్డుల్లో ఇప్పటి వరకూ 19 వార్డుల్లో లెక్కింపు పూర్తయ్యింది. వీటిల్లో టీఆర్ఎస్‌ 16 చోట్ల విజయం సాధించింది. దీంతో జడ్చర్ల మునిసిపాలిటీని  టీఆర్ఎస్‌ కైవసం చేసుకుంది. కొత్తూరు (12) లో వెలువ‌డిన 11 వార్డుల ఫ‌లితాల్లో  టీఆర్ఎస్ ఏడు వార్డుల్లో గెలిచింది.

దీంతో ఆ మునిసిపాలిటీని టీఆర్ఎస్ కైవ‌సం చేసుకుంది. న‌కిరేక‌ల్ లో మొత్తం 20 వార్డుల్లో 17 వార్డుల ఫ‌లితాలు వెల్ల‌డ‌య్యాయి. టీఆర్ఎస్ 10, కాంగ్రెస్ 2, ఇత‌రులు ఐదు వార్డుల్లో గెలిచారు. మిగ‌తా మునిసిపాలిటీల్లో కౌంటింగ్ కొన‌సాగుతోంది.