ఎంపీగా గెలిచిన నేప‌థ్యంలో జ‌గ‌న్‌ను క‌లిసిన గురుమూర్తి

03-05-2021 Mon 12:37
  • తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో విజ‌యం
  • జ‌గ‌న్‌కు పుష్ప‌గుచ్చం అందించిన గురుమూర్తి
  • జ‌గ‌న్‌ను క‌లిసిన ప‌లువురు మంత్రులు
gurumurty meets jagan

నిన్న వెల్ల‌డైన తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక ఫ‌లితాల్లో వైసీపీ అభ్య‌ర్థి డాక్టర్ మద్దిల గురుమూర్తి విజయం సాధించిన విష‌యం తెలిసిందే. తన సమీప ప్రత్యర్థి పనబాక లక్ష్మి (టీడీపీ)పై ఆయ‌న భారీ మెజార్టీని సాధించారు. గురుమూర్తిని వైసీపీ నేత‌లు అభినందిస్తున్నారు.
         
తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీ భారీ విజయం సాధించిన నేపథ్యంలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ను గురుమూర్తితో పాటు ప‌లువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్‌కు గురుమూర్తి పుష్ప‌గుచ్చం అందించి, కాసేపు మాట్లాడారు. గురుమూర్తిని జ‌గ‌న్ అభినందించారు.