Reliance Retail: 100 బిలియన్ డాలర్ల క్లబ్ లో రిలయన్స్ రిటైల్!

  • రిలయన్స్ అనుబంధ సంస్థగా ఉన్న రిలయన్స్ రిటైల్
  • 100 బి. డాలర్లను తాకిన నాలుగో భారత కంపెనీగా గుర్తింపు
  • త్వరలోనే ఐపీఓకు వచ్చే అవకాశం
Reliance Retail in 100 Billion Dollor Club

ముఖేశ్ అంబానీ నేతృత్వంలో నడుస్తున్న భారత అతిపెద్ద పారిశ్రామిక సంస్థ రిలయన్స్ అనుబంధ రిలయన్స్ రిటైల్ 100 బిలియన్ డాలర్ల విలువను సాధించింది. ఈ మైలురాయిని తాకిన నాలుగో ఇండియన్ కంపెనీగా రిలయన్స్ రిటైల్ నిలిచింది. దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్స్ నుంచి కిరాణా సరుకులు, పాలు, కూరగాయలు వంటి నిత్యావసరాల స్టోర్లను సంస్థ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఇంతవరకూ రిలయన్స్ రిటైల్ ఐపీఓకు రాలేదు. సంస్థ ఇంకా స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ కూడా కాలేదు. అయితే, ప్రస్తుతం సంస్థ షేర్లు రూ. 1,500 నుంచి రూ.1,550 మధ్య ఉండవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేశారు.

గత సంవత్సరం రిటైల్ విభాగంలోని వాటాలను విక్రయించడాన్ని సంస్థ యాజమాన్యం మొదలు పెట్టగా, ఆపై సంస్థ విలువ భారీగా పెరుగుతూ వచ్చింది. డిసెంబర్ 2019లో రూ. 900 వద్ద ఒక్కో వాటా విలువ ఉండగా, డిసెంబర్ 31, 2020తో ముగిసిన త్రైమాసికానికి ఏకంగా 88 శాతం నికర లాభ వృద్ధిని నమోదు చేసి, రూ. 1,830 కోట్లను ఆర్జించింది. త్వరలోనే సంస్థ ఐపీఓకు కూడా వస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

More Telugu News