Pavan Kalyan: పవన్ భార్య పాత్రలో నిత్యామీనన్?

Nithya Menon is doing as Pavan kalyan wife role in Ayyappanum Koshiyum
  • 'వకీల్ సాబ్'తో హిట్ కొట్టిన పవన్
  •  సెట్స్ పై మలయాళ మూవీ రీమేక్
  • సాయిపల్లవి డేట్స్ లేవనే టాక్  

'వకీల్ సాబ్' సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కల్యాణ్, తన సత్తా ఎంతమాత్రం తగ్గలేదనే విషయాన్ని నిరూపించారు. ఆ తరువాత కరోనా బారిన పడిన ఆయన, త్వరలో మళ్లీ షూటింగులో పాల్గొననున్నారు. క్రిష్ దర్శకత్వంలో 'హరిహర వీరమల్లు' చేస్తున్న ఆయన, మరో వైపున మలయాళ మూవీ 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్ లో నటిస్తున్నారు. సాగర్ కె. చంద్ర ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో మరో కీలకమైన పాత్రను రానా పోషిస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాలో పవన్ కల్యాణ్ భార్య పాత్ర్రలో సాయిపల్లవి కనిపించనున్నట్టుగా వార్తాలు వచ్చాయి. ఆ తరువాత ఐశ్వర్య రాజేశ్ పేరు వినిపించింది. పవన్ భార్య పాత్రకి వీరు సెట్ అవుతారా? అనే సందేహం అభిమానులను వెంటాడింది. అయితే సాయిపల్లవి డేట్స్ లేని కారణంగా నిత్యామీనన్ ను ఎంపిక చేసుకున్నారనే వార్త తాజాగా వినిపిస్తోంది. నిత్యామీనన్ ఎంత నేచురల్ గా చేస్తుందనే విషయాన్ని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం లేదు. నెక్స్ట్ షెడ్యూల్లో ఆమె షూటింగులో పాల్గొంటుందని అంటున్నారు. ఈ మధ్య కాలంలో నిత్యామీనన్ కి పడిన మంచి పాత్ర ఇది అని చెప్పుకోవచ్చు.

Pavan Kalyan
Rana
Nithya Menon

More Telugu News